ఆ వార్త విన్నప్పుడు నా గుండె పగిలిపోయింది:బన్నీ
Spread the love

ఒక సినిమా హీరోకి అభిమానులే బలం. వాళ్లే బలహీనత. అభిమానులంటూ లేకపోతే అసలు హీరోలే ఉండరు. ఇది అందరూ అంగీకరించే నగ్న సత్యం. అందుకే స్లార్లంతా తమ అభిమానులను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు.వారు ఇబ్బందుల్లో ఉంటే ఆదుకుంటారు.ఇప్పటి వరకు చాలా మంది తెలుగు హీరోలు కష్టాల్లో ఉన్న తమ అభిమానులను ఆదుకున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన అభిమానికి సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నారు. 

అనకాపల్లికి చెందిన 10వ తరగతి కుర్రాడు దేవ్ సాయి గణేష్‌కు అల్లు అర్జున్ అంటే ప్రాణం.కొంత కాలంగా గణేష్ బోన్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడు.తన అభిమాన నటున్ని చూడాలని, కలవాలని దేవసాయి గణేష్ కోరడంతో కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఫ్యాన్ అసోసియేషన్స్ ద్వారా అల్లు అర్జున్ దృష్టికి తీసుకెళ్లారు.దీంతో వారం రోజుల క్రితం అంటే గత శనివారం నేరుగా అనకాపల్లి వెళ్లిన బన్నీ.17 ఏళ్ల గణేష్‌ను కలిసి ధైర్యం చెప్పారు .త్వరలోనే కోలుకుంటావని దైర్యం చెప్పారు. అతడి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేసేందుకు కూడా బన్నీ ముందుకొచ్చారు. గణేష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే బన్నీ కోరిక ఫలించలేదు. తన కుటుంబంతో సహా అండగా నిలిచిన తోటి అభిమానులను కన్నీటి సంద్రంలో ముంచుతూ ఈ రోజు దేవ్ సాయి గణేష్ కోలుకోలేక కన్నుమూసాడు.డాక్టర్లు విశ్వప్రయత్నం చేసినప్పటికీ గణేష్ శరీరం సహకరించలేదని ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయని దగ్గరుండి చూసుకున్న సన్నిహితుల సమాచారం ఆరోగ్యం మరింత క్షీణించి ఆదివారం గణేష్ చనిపోయాడు.

అయితే అభిమాని మృతి పట్ల అల్లు అర్జున్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితమే తాను పరామర్శించి వచ్చిన అభిమాని ఇకలేడనే వార్తను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ మేరకు ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు. సాయి గణేష్ ఆత్మకు శాంతి చేకూరాలి. అతను ఇకలేడనే వార్తను నేను విన్నప్పుడు గుండె పగిలిపోయింది.కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నానుఅంటూ బన్నీ పేర్కొన్నారు.ఆ మధ్య తన అభిమాని ఒకరు ప్రమాదంలో చనిపోతే కార్తి అంత్యక్రియలకు వెళ్లి గుండెలవిసెలా కన్నీరు పెట్టడం మీడియాని సైతం కదిలించింది. ఎంత హీరో అయినా అబిమాని అయినా విధి రాతకు కట్టుబడి ఉండక తప్పదు.దేవ్ గణేష్ మృతి పట్ల బన్నీ ఫ్యాన్స్ తో పాటు ఇతర హీరోల అభిమానుల నుంచి సంతాపం వ్యక్తమవుతోంది.గణేష్ మృతి ఫై స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గణేష్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిధాం.