‘మిషన్‌ మంగళ్‌’ లో అక్షయ్‌ కుమార్‌,కష్మీరా పరదేశి
Spread the love

‘మిషన్‌ మంగళ్‌’ అంటూ స్పేస్‌లోకి వెళ్తున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌. అంతేనా? తనతో పాటుగా ఐదుగురు కథానాయికలని వెంటబెట్టుకొని వెళ్తున్నాడు.జగన్‌ శక్తి అనే కొత్త డైరెక్టర్ డైరెక్షన్లో అక్షయ్‌ కుమార్, విద్యా బాలన్, తాప్సీ, నిత్యా మీనన్, సోనాక్షి సిన్హా, కృతీ కుల్హారీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కనున్న సినిమా ‘మిషన్‌ మంగళ్‌’. భారతదేశం చేసినటువంటి మిషిన్‌ మార్స్‌ ఆధారంగా ఈ సినిమా చిత్రీకరించనుంది . ఈ ఐదుగురు కథానాయికలతో పాటు మరో భామ కూడా ఈ సినిమాకి తోడయ్యారు. ‘నర్తనశాల’ ఫేమ్‌ కష్మీరా పరదేశి కూడా ఈ మూవీలో నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేశారు.