నాగార్జ్జునకు మనవడిగా నాగచైతన్య
Spread the love

అక్కినేని మూడు తరాల వారసులంతా కలిసి నటించిన సినిమా మనం. ఈ సినిమాలో నాగచైతన్య తండ్రిగాను, నాగార్జున కొడుకుగానూ నటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెరపైకి రానున్నచిత్రంలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన క్యారక్టర్లో వీరిద్దరు కనిపించనున్నారని తెలిసింది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకి కల్యణ్‌కృష్ణ కురసాల త్వరలో సీక్వెల్‌ని రూపొందించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాకి బంగార్రాజు అనే టైటిల్‌ను ఇదివరకే ఖరారు చేసిన సంగతి మనకి తెలిసిందే. ఇందులో నాగార్జ్జునకు మనవడిగా నాగచైతన్య నటించనున్నట్లు సినిమా వర్గాల సమాచారం. బంగార్రాజుగా నాగార్జున నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాల్ని సినిమా బృందం త్వరలో తెలుపనున్నట్లు సమాచారం.