మిత్రన్ దర్శకత్వంలో అఖిల్
Spread the love

డెబ్యూతో కలిపి మూడు సంవత్సరాలలో కేవలం రెండు చిత్రాలకే పరిమితమైన అఖిల్ తన మూడో చిత్రం మిస్టర్ మజ్ను మీద గట్టి ఆశలే పెంచుకున్నాడు . పేరున్న డైరెక్టర్లతో చేసినా అఖిల్-హలో తీవ్రంగా నిరాశ పరచడం వల్ల ఫాన్స్ కూడా దీని మీద చాలా నమ్మకంతో ఉన్నారు. ఒక్క పాట తప్ప చిత్రీకరణ మొత్తం పూర్తయిన మిస్టర్ మజ్ను డిసెంబర్ విడుదల కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇక దీని తర్వాత సినిమాకి కూడా అఖిల్ సిద్ధం అవుతున్నాడని ఇన్ సైడ్ టాక్.

ఈ సంవత్సరం డబ్బింగ్ సినిమాల్లో టాప్ హిట్ గా నిలిచిన అభిమన్యుడు డైరెక్టర్ మిత్రన్ చెప్పిన స్టోరీ ఒకటి అఖిల్ కి బాగా నచ్చడంతో డెవలప్ చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. షూటింగ్ ఎప్పుడు ఉండొచ్చు అనే విషయం క్లారిటీ లేదు కానీ మిస్టర్ మజ్ను రిలీజ్ అయ్యే లోపు స్క్రిప్ట్ రెడీ గా ఉంటే ఎక్కువ లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేలా ప్లానింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది .కోలీవుడ్ లో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ మిత్రన్ కోరి మరీ అఖిల్ దాకా ఎందుకు వచ్చాడో సస్పెన్స్. డెబ్యూ మూవీతోనే మూవీ లవర్స్ ని మెప్పించిన మిత్రన్ వెబ్ క్రైమ్ ని నేపధ్యంగా చేసుకొని కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా తీసిన తీరు కమర్షియల్ సక్సెస్ ని కూడా ఇచ్చింది.

అఖిల్ కు చెప్పిన పాయింట్ కూడా చాలా వైవిధ్యంగా ఉందని రెగ్యులర్ లవ్ స్టోరీస్ లాంటి వాటి జోలికి వెళ్లకుండా మిత్రన్ విభిన్నమైన నేపధ్యాన్ని తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. మరి అఖిల్ నిజంగా ఒప్పుకున్నాడా లేక ఆ మధ్య ఇద్దరు ముగ్గురు దర్శకుల కథలు విని డ్రాప్ అయినట్టు దీన్ని చివర్లో వద్దంటాడా ప్రస్తుతానికి సస్పెన్స్. మిస్టర్ మజ్ను సెట్స్ పైకి వెళ్ళడానికి ముందు ఆరు నెలలు కథలు వినడంలోనే గడిపేసిన అఖిల్ మెచ్చేలా మిత్రన్ చెప్పిన లైన్ ఏముందో వేచి చూడాలి