పూరి జగన్నాథ్ తనయుడి రెండవ సినిమాలో కొత్త హీరోయిన్…
Spread the love

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాశ్ హీరోగా ‘మెహబూబా’ చిత్రాన్ని తెరకెక్కించాడు.ఈ చిత్రం అనుకున్నంతగా విజయాన్ని ఇవ్వలేదు..అందువల్ల ఈ సినిమా వల్ల పూరి జగన్నాథ్ కు చాలా నష్ట౦ వచ్చింది.కాని పూరి వాటిని లెక్కచేయకుండా ఆకాశ్ హీరోగా మరొక సినిమాను చేయడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమాకి కూడా ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ కథాకథనాలను అందింస్తుండగా అనిల్ అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం చాలామంది పేర్లను పరిశీలించారు.చివరికి గాయత్రి భరద్వాజ్ ను ఎంపిక చేసుకున్నారట. గాయత్రి భరద్వాజ్ ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయం కానుంది.మాఫియా నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఈ సినిమా ఆకాశ్ కి హీరోగా మంచి బ్రేక్ ఇస్తుందని పూరి జగన్నాథ్ భావిస్తున్నాడు.