‘2.0’లో ఐశ్వర్య రాయ్ ఉందా…?
Spread the love

సూపర్ స్టార్ రజినీకాంత్, ఐశ్వర్యరాయ్ జంటగా వచ్చిన ‘రోబో’ బ్లాక్‌బస్టర్ సాధించి రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఆ సినిమాకు సీక్వల్‌గా 2.0 సినిమా రాబోతోంది.భారీ బడ్జెట్‌తో శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రజినీకాంత్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది.అంతేకాకుండా అక్షయ్ కుమార్ కూడా విలన్ గా అలరించబోతున్నాడు.ఇటీవలే విడుదలైన టీజర్ ‘2.0’ సినిమాపై భారీ స్థాయిలో అంచానాలు పెంచింది.

తాజాగా ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ కూడా నటిస్తుందని వార్త సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తుంది.ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ గెస్ట్ రోల్‌లో కనిపి౦చబోతుంది అనే వార్త వినిపిస్తుంది.కాని ఈ విషయాన్నీ ఇప్పటివరకు చిత్ర యూనిట్ అధికారికంగా  ప్రకటించలేదు.ఒకవేళ ఇది నిజ౦ అయితే మాత్రం ప్రేక్షకులకు పండగే.షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 29న విడుదలకు సిద్ధమవుతోంది.