కమాండో అర్జున్‌ పండిట్‌ పాత్రలో ‘ఆది’
Spread the love

ఆది సాయికుమార్‌, శషా చెట్రి, కార్తీక్‌ రాజు, పార్వతీశం, నిత్యా నరేష్‌ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’. సాయికుమార్‌ అడివి డైరెక్టర్ . ప్రతిభా అడివి, కట్ట ఆశిష్‌ రెడ్డి, కేశవ్‌ ఉమా స్వరూప్‌, పద్మనాభరెడ్డి, సతీష్‌ డేగలతో పాటు ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ కలసి నిర్మించిన సినిమా ఇది . దీపావళి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు.డైరెక్టర్ మాట్లాడుతూ ‘‘కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న కల్పిత స్టోరీ ఇది. కమాండో అర్జున్‌ పండిట్‌ పాత్రలో ఆది కనిపిస్తారు. చివరి షెడ్యూల్‌లో భాగంగా కార్గిల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో మైనస్‌ పది డిగ్రీల ఉష్ణోగ్రతలో ప్రధాన సన్నివేశాల్ని చిత్రీకరిస్తామన్నారు .