భవిష్యత్‌ కోసం ఓటు వేయాలి : అలేఖ్య ఏంజెల్
Spread the love

అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సినీనటి అలేఖ్య ఏంజెల్ కోరారు. నిస్వార్థంతో ప్రజల అభివృద్ధికి పాటుపడే నాయకులకు ఓటేయాలని ఆమె సూచించారు.. ఓటు అనేది మనకు లభించిన ఆయుధమని, అది మన దగ్గర ఉన్న శక్తి అన్నారు. అత్యుత్తమ భవిష్యత్‌ కోసం మాత్రమే ఆ శక్తిని ఉపయోగించాలని, అందుకు సమాజ సేవ చేసే నాయకులను ఎన్నుకోవాలని అలేఖ్య పిలుపునిచ్చారు. ఓటు ద్వారా అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మన భవిష్యత్ ను ఉన్నతంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుందన్నారు.