500 కోట్ల క్లబ్ లో ‘2.0’ చిత్రం ..
Spread the love

దర్శకుడు శంకర్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇద్దరూ..తమ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో ‘2.0’ సినిమా చేశారు.ఇది నిర్మాతలకి అతిపెద్ద సాహసమే అయినా సరే కథాకథనాలు వాటికి బలాన్ని చేకూర్చే గ్రాఫిక్స్ వాటిపై పూర్తి అవగాహన కలిగిన శంకర్ ఆలోచనల మీద నమ్మకంతో నిర్మాతలు రంగంలోకి దిగారు.
‘2.0’ సినిమా విడుదలైన తొలి రోజునే 100 కోట్లను వసూలు చేసి కొత్త రికార్డును సృష్టించింది.వీకెండ్ వరకూ వసూళ్లు నిలకడగా కొనసాగాయి.తొలివారంలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లను రాబట్టింది.తెలుగు,తమిళ,హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక నైజామ్ లోను కొత్త రికార్డును సొంతం చేసుకుంది.మొదటి వారంలో 17 కోట్ల షేర్ ను రాబట్టింది.ఒక అనువాద చిత్రానికి నైజామ్ లో ఈ స్థాయి వసూళ్లు దక్కడం ఇదే మొదటిసారి అంటున్నారు.