యూపీలో పార్టీల బలాబలాలు

యూపీలో పార్టీల బలాబలాలు

On

న్యూఢిల్లీ : దేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి ఎన్ని సీట్లే కాకుండా ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయన్నది కూడా ముఖ్యమైనదే. రాష్ట్రంలో మొత్తం 80 సీట్లుండగా, బీజేపీ తన మిత్రపక్షమైన అప్నాదళ్‌కు రెండు సీట్లను వదిలేసి మొత్తం 78 సీట్లకు పోటీ చేసింది. అలాగే ఎస్పీ, బీఎస్పీ కూటమి…

ప్రజాతీర్పుపై స్పందించిన కమల్‌

ప్రజాతీర్పుపై స్పందించిన కమల్‌

On

చెన్నై:  హీరో కమల్‌ హాసన్‌ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది. తమిళనాడు, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కమల్‌ బొక్క బోర్లా పడ్డారు. ఆ పార్టీని ప్రజలు తిస్కరించారు. అయితే పార్టీ ఘోర పరాజయంపై కమల్‌ పెదవి విప్పారు. శుక్రవారం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…

వైఎస్‌ జగన్‌కు యూఎస్‌ కాన్సులేట్‌ అభినందనలు

వైఎస్‌ జగన్‌కు యూఎస్‌ కాన్సులేట్‌ అభినందనలు

On

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుత్తున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖులతో పాటు దేశ వ్యాప్తంగా ప్రధానితో సహా పలువురు జాతీయ నేతలు కూడా వైఎస్‌ జగన్‌ను అభినందించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కాథరీన్‌ హడ్డా వైఎస్‌ జగన్‌కు అభినందనలు తెలిపారు. ‘‘ఏపీ అసెంబ్లీ,…

వైఎస్‌ జగన్‌కు భద్రత పెంపు

వైఎస్‌ జగన్‌కు భద్రత పెంపు

On

అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని నివాసాన్ని, చుట్టుపక్కల ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాడేపల్లి ప్రాంతంలో పూర్తిగా ఆంక్షలు పెట్టారు. కాసేపట్లో వైఎస్‌ జగన్‌తో ఉన్నతాధికారుల సమావేశం కానున్నారు. రాష్ట్ర పరిస్థితులను ఆయన వివరించనున్నారు. జగన్‌కు తాత్కాలిక కాన్వాయ్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్న…

‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో సంబరాలు

‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో సంబరాలు

On

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడంతో బంజారాహిల్స్‌లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో గురువారం సంబరాలు అంబరాన్నంటాయి. సిబ్బంది బాణాసంచా కాల్చి, కేక్‌ కట్‌ చేశారు. డ్యాన్సులు చేస్తూ సందడిగా గడిపారు. వైఎస్సార్‌ సీపీ అద్భుత ఫలితాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ‹

యువ సీఎంకు అభినందనలు

యువ సీఎంకు అభినందనలు

On

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై అన్నివర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అలుపెరగని పోరాటం చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చిన జననేతపై అభినందనల వర్షం కురుస్తోంది. వైఎస్‌ జగన్‌ను అభినందిస్తూ పలువురు సినిమా ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా అభినందనలు తెలుపుతున్నారు. ‘ఘన విజయం సాధించిన కొత్త యువ ముఖ్యమంత్రి వైఎస్‌…

జగన్‌ ప్రభంజనం ఇలా..

జగన్‌ ప్రభంజనం ఇలా..

On

హైదరాబాద్‌ : కష్టాలెన్ని ఎదురొచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన. నమ్మిన సిద్ధాంతం, విలువల కోసం దృఢంగా నిలబడే వ్యక్తిత్వం. ఓదార్పు యాత్ర అయినా.. పాదయాత్ర అయినా ప్రజల కోసం ఏందాకైనా ముందుకు సాగే ధీరత్వం.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆఖండ విజయాన్ని అందించాయి. జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలన్న ఆరాటం.. చంద్రబాబు…

మోదీకి ఇమ్రాన్‌ ఖాన్‌ అభినందనలు

మోదీకి ఇమ్రాన్‌ ఖాన్‌ అభినందనలు

On

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో మరోసారి గెలుపొందడంతో ప్రధాని నరేంద్ర మోదీని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అభినందించారు. దక్షిణాసియాలో శాంతి, పురోగతి కోసం తాను మోదీ ప్రభుత్వంతో పనిచేసేందుకు సిద్ధమని ఈ సందర్భంగా ఇమ్రాన్‌ ట్వీట్‌ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే అత్యధిక మెజారిటీతో దూసుకువెళ్లిన సంగతి తెలిసిందే. బీజేపీ సొంతంగా మేజిక్‌ మార్క్‌…

కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

On

 కరీంనగర్‌: కరీంనగర్‌ పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్భందీగా సాగాలని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న ఓట్ల లెక్కింపు జరుగనున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆయన పోలీసు కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి, ఎన్నికల పరిశీలకులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కరీంనగర్‌…

ఫలితాలు చెప్పే ‘ఓటర్‌ హెల్ప్‌లైన్‌’ యాప్‌

ఫలితాలు చెప్పే ‘ఓటర్‌ హెల్ప్‌లైన్‌’ యాప్‌

On

న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాలు.. ఒక్కో టీవీ చానెల్‌ ఒక్కో రకంగా చూపిస్తుంది. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియని గందరగోళం. ఈ పరిస్థితికి భారత ఎన్నికల కమిషన్‌ ఇటీవల విడుదల చేసిన యాప్‌ చెక్‌ పెట్టేస్తుంది. ఈ యాప్‌ని ఒకసారి డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌కు సంబంధించిన అధికారిక వివరాలు మీ మొబైల్‌లోకి నేరుగా వచ్చేస్తాయి….