జూలై 16 నుంచి ‘ఫ్లిప్‌కార్ట్‌’ బిగ్ షాపింగ్ డేస్
Spread the love

దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్‌’ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ను ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌కు పోటీగా ఫ్లిప్ కార్ట్ సైతం సిద్ధ‌మ‌వుతోంది.  జూలై 16 నుంచి ప్రారంభమయ్యే డేస్‌ జూలై 19 వరకు కొనసాగనుంది. స్మార్ట్‌ఫోన్లు, గాడ్జెట్లు వంటి ఉత్పత్తులపై బంపర్‌ ఆఫర్లను, బిగ్‌ డీల్స్‌ను అందించనున్నట్టు తెలిపింది. ఈ సేల్‌లో గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ఫోన్‌ రూ.42,999కే అందుబాటులో ఉంటుంది. ఎక్స్చేంజ్‌పై 3 వేల రూపాయల తగ్గింపు, 8వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌, 37 వేల రూపాయల వరకు బై-బ్యాక్‌ ఆఫర్‌ గ్యారెంటీ కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌కు లభ్యమవుతుంది.